పదవీ విరమణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

AKP: గొలుగొండ మండలం, సీహెచ్ నాగపురంలో ఆదివారం ఉపాధ్యాయులు పదవి విరమణ సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పాల్గొని ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఉమా శంకర్ గణేష్‌తో పాటు గొలుగొండ, కొయ్యూరు జడ్పీటీసీలు గిరిబాబు, నూకరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, కూటమి నాయకులు ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.