రేపటి నుంచి స్త్రీ శక్తి పథకం ప్రారంభం

KKD: రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి అమలవుతుందని కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ పథకాన్ని విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారన్నారు.