వేటపాలెం ఎస్సైగా జనార్ధన్ బాధ్యతలు

వేటపాలెం ఎస్సైగా జనార్ధన్ బాధ్యతలు

బాపట్ల: వేటపాలెం నూతన ఎస్సైగా జనార్ధన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడు నుంచి వేటపాలెంకు బదిలీ అయ్యారు. గతంలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ ఈపురుపాలెం ఎస్సైగా పనిచేశారు. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.