దిగువగంగంపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ
సత్యసాయి: గోరంట్ల మండలం దిగువ గంగంపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేశారు. గోరంట్ల మండల టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. NREGS పథకం క్రింద రూ. 8 లక్షల నిధులతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్త కళల అభివృద్ధి డైరెక్టర్ సోమశేఖర్, మాజీ సర్పంచ్ నరేష్, తదితరులు పాల్గొన్నారు.