సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించబోమని తేల్చి చెప్పింది. కొత్త చట్టం ప్రకారం అటువంటి ఉపశమనం పొందటానికి వక్ఫ్ ట్రిబ్యునల్‌కు వెళ్లాలని సూచించింది. వక్ఫ్ ఆస్తుల డేటాను అప్‌లోడ్ చేయటానికి గడువు పెంచాలని ముస్లీం లా బోర్డు పిటిషన్ వేసింది.