మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష
PPM: మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే అధిక మొత్తంలో జరిమానా, జైలుశిక్ష తప్పవని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి హెచ్చరించారు. ఈనెల 24న పాలకొండ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 16 మంది మద్యం సేవించి పట్టుబడ్డారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవ్వడం జరుగుతుందన్నారు.