'సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి'
MNCL: సర్పంచ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ పిలుపునిచ్చారు. లక్షెట్టిపేటలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఏకమై ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.