మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరిష్

మోడల్ స్కూల్‌ను సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరిష్

HNK: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామం మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణలో జరుగుతున్న నూతన భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మేన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.