పెట్రోల్ వద్దు, EV ముద్దు.. విన్ ఫాస్ట్ బంపర్ ఆఫర్
పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారే వారికి EV కార్ల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ 'ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్' పేరుతో 3 శాతం అదనపు డిస్కౌంట్ ప్రకటించింది. దీనివల్ల VF6 మోడల్‌పై రూ.57,570, VF7పై రూ.80,370 వరకు లాభం ఉంటుంది. ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు 75 శాతం బైబ్యాక్ గ్యారెంటీని కూడా కంపెనీ ఇస్తోంది.