15 గంటలు ఎదురుచూస్తే.. ఒక్క బస్తా..!

15 గంటలు ఎదురుచూస్తే.. ఒక్క బస్తా..!

MDK: శివ్వంపేట సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు రాత్రి నుంచి బారులు తీరారు. వందలాది మంది రైతులు, మహిళలు, వృద్ధులు క్యూలో నిలిచారు. వివిధ గ్రామాల నుంచి కుటుంబసమేతంగా 15 గంటలుగా ఎదురు చూస్తున్నారు. రెండు లారీలు యూరియా రాగా, ఒక్కో బస్తా చొప్పున విక్రయించామని సీఈవో మధు తెలిపారు. 15 గంటలు ఎదురుచూస్తే.. ఒక్క బస్తా ఇస్తున్నారంటూ పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.