నానల్‌నగర్ చౌరస్తాలో రోజంతా వాహనాల రద్దీ
HYD: ట్రాఫిక్ విషయంలో నగరమంతా ఒక ఎత్తు అయితే నానల్‌నగర్ చౌరస్తా మరో ఎత్తు. మెహిదీపట్నం నుంచి హైటెక్ సిటి మార్గంలోని ఈ నానల్‌నగర్ కూడలి దాటాలంటే వాహనదారులు గంటపాటు పడిగాపులు కాయాల్సిందే. అక్కడ వాహనాల రద్దీ 24 గంటలు ఉంటుంది. GHMC పరిధిలో పనిచేసే ఇంజినీర్లు, వాహనరద్దీని తగ్గించాల్సిన ట్రాఫిక్ పోలీసులూ నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలొస్తున్నాయి.