VIDEO: కాశీబుగ్గ సెంటర్‌లో రాగి జావా పంపిణీ
WGL: నగరంలోని కాశీబుగ్గ సెంటర్‌లో బుధవారం వంగరి పరపతి సంఘం ఆధ్వర్యంలో రెండవ రోజు బాటసారులకు రాగిజావా పంపిణీ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్డుపై వెళ్లే వారికి ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటికి రావాలని వారు సూచించారు.