స్టేషన్ ఘనపూర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

స్టేషన్ ఘనపూర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

JN: స్టేషన్ ఘనపూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేతలు మాట్లాడుతూ.. మన దేశానికి ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో శిరీష్ రేడ్డి, శంకర్ ఉన్నారు.