గ్రామాలల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి
SRPT: గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆశావాహులు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ “బాబాయ్, చిన్నమ్మా.. నీ ఓటు నాకే” అంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ఉద్యోగ-ఉపాధి నిమిత్తం పట్టణాల్లో ఉన్నవారికి ఫోన్ చేసి “అన్నా, తమ్ముడూ.. ఈసారి సర్పంచ్‌గా పోటీలో ఉన్నా.. ఇంటికి వచ్చి ఓటు వేసి వెళ్లూ” అంటూ ప్రచారం చేస్తున్నారు.