బ్యాంక్ యూనియన్ నేత గుండెపోటుతో మృతి
W.G: తాడేపల్లిగూడెం పట్టణం బ్యాంక్ యూనియన్ నేత ఎస్ఎస్ ప్రసాద్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. భౌతికకాయాన్ని యూనియన్ నాయకులు సందర్శించేందుకు వారి నివాసం వద్ద ఉంచారు. భవన నిర్మాణ బోటీ చైర్మన్ పొలాల మల్లికార్జునరావు పూలమాల వేసి నివాళులర్పించారు. యూనియన్ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.