మృతుల కుటుంబసభ్యులకు పరామర్శ

KRNL: కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్, జడ్పీటీసీ రఘునాథరెడ్డి, సర్పంచ్ భాగ్యరత్న పరామర్శించారు. కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.