11వ వార్డులో ఉచిత వైద్య శిబిరం
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 11వ వార్డు చిట్టిరావడం తండాలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని ప్రజలకు ఎక్సరే, బీపీ, షుగర్, క్షయ వంటి ఇతర వ్యాధులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో మాజీ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.