సిగాచి పరిశ్రమను మూడు నెలలు మూత.. రూ. కోటి నష్టపరిహారం

SRD: పాష మైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన ప్రతి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నట్లు సిగాచి పరిశ్రమ వైస్ ఛైర్మన్ వివేక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటనలో ప్రమాదంలో 40 మంది మరణించారని, 33 మంది గాయపడ్డారని అన్నారు. కంపెనీని మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు.