తన భార్యను గెలిపించాలని భర్త కంటతడి
SDPT: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా నాగుల స్రవంతి నామినేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త ప్రశాంత్ తన భార్యను గెలిపించాలని గ్రామస్తులను వేడుకుంటున్నాడు. గతంలో తాను పోటీ చేసి ఓడిపోయానని.. ఈ సారైనా తన భార్యను గెలిపించాలని కోరుతూ గ్రామస్తుల ఎదుట కంటతడి పెట్టుకున్నాడు. భర్త ఆ విధంగా వేడుకోవడం చూసిన సర్పంచ్ అభ్యర్థి స్రవంతి కన్నీరు పెట్టుకుంది.