పెద్దలు కాదన్నా.. ప్రియుడిని వరించిన యువతి
AP: ప్రేమ అనేది రెండు మనసుల కలయిక అని, దానికి రూపం, ఎత్తు, అందం వంటి కొలమానాలు ఉండవని మచిలీపట్నానికి చెందిన షేక్ గౌసియా(19), శశి(23) నిరూపించారు. మతం వేరైనా, తన బాల్య మిత్రుడు మరుగుజ్జుగా ఉన్నా అతన్నే ప్రేమించింది. పెద్దలు నిరాకరించినా పెళ్లి చేసుకుని.. రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. తన మనసు మెచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్న గౌసియా ధైర్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.