అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో
BPT: మార్టూరులో రెవెన్యూ సిబ్బందికి బాపట్ల ఆర్డీవో గ్లోరియా వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో 'దిత్వా' తుఫాను, రీసర్వే, పీజీఆర్ఎస్‌పై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు.