ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య
BDK: అశ్వారావుపేట నందమూరి కాలనీకి చెందిన నక్కల నక్షత్ర (19) అనే యువతి ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆదివారం వెల్లడించారు. రెండేళ్లుగా నక్షత్ర తన బంధువైన సింహాద్రిని ప్రేమించింది. అయితే 2 నెలలుగా అతడు పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని చెప్పడంతో విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అన్నారు.