జిల్లాలో వరుస హత్యలు భయాందోళనలో ప్రజలు

జిల్లాలో వరుస హత్యలు భయాందోళనలో ప్రజలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత నెల రోజులుగా భారీగా హత్యలు జరుగుతున్నాయి. ఈ వరుస హత్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో హత్యలు జరగడంతో సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత భయపడుతున్నారు. రాత్రి వేళల్లో ఎవరూ సురక్షితంగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.