'విద్యార్ధుల నైపుణ్యం పెంచేలా కృషి చేయాలి'
VZM: విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ గాదెల శ్రీనివాసనాయుడు అన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీట్‌లో పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.