పోలీస్ స్టేషన్‌‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

పోలీస్ స్టేషన్‌‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

JGL: 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రామ్నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు.