'బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది'

'బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది'

RR: ఢిల్లీలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ, విపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. బీహార్ ఓట్ల నమోదులో జరిగిన అవకతవకలపై ఇండియా కూటమి నేతలు ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళుతుండగా బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపించారు.