యువతితో అసభ్య ప్రవర్తన.. వైద్యుడిపై దాడి
TG: మహబూబాబాద్ తొర్రూరులో ఆయుర్వేద వైద్యుడిపై దాడి చేశారు. అయితే వైద్యుడు కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని యువతి ఆరోపించింది. దీంతో కిరణ్‌పై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆయుర్వేద వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.