మహా గర్జన సభను జయప్రదం చేయండి: MSP

KMM: పెన్షన్ దారుల సమస్యలపై ఈనెల 9న సత్తుపల్లిలో నిర్వహించే మహా గర్జన సభను విజయవంతం చేయాలని MSP సీనియర్ నాయకులు ముత్తారావు అన్నారు. గురువారం సత్తుపల్లి మండలం రేజర్లలో సమావేశం నిర్వహించారు. ఈ మహా గర్జనకు ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ రానున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు.