నిడదవోలు పట్టణాభివృద్ధికి చర్యలు: మంత్రి
E.G: నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తికావడంతో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం 5కే రన్ అండ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని, జెండా ఊపి 5K రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిడదవోలు పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే, పట్టణ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.