మున్సిపాలిటీల అభివృద్దే లక్ష్యం: ఎంపీ

MBNR: పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎంపీ డీకే అరుణ వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి తారాజీని గురువారం ఎంపీ కలిశారు. పార్లమెంటరీ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇంతకు ముందు అందజేసిన ప్రతిపాదనలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.