BRS అప్పుల వల్లే రాష్ట్రానికి కష్టాలు: మంత్రి తుమ్మల

BRS అప్పుల వల్లే రాష్ట్రానికి కష్టాలు: మంత్రి తుమ్మల

TG: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అరాచకం సృష్టించి అవినీతిని పెంచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. వారి హయాంలో చేసిన రూ.8.50 లక్షల కోట్ల అప్పుల వల్ల ప్రస్తుతం నెలకు రూ.7 వేల కోట్లు అసలు, వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. గత ప్రభుత్వ తప్పుల వల్లే ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. BRS హయాంలో రుణమాఫీ, దళితబంధు వంటి హామీలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు.