డబల్ బెడ్ రూమ్ కాలనీలో జెండా ఆవిష్కరణ

WNP: పట్టణ సమీపంలోని చిట్యాల రోడ్డు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను బలరాం వెంకటేష్ ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల సేవలను కొనియాడారు. మండ్లరాజు, వినోద్, జమ్ములమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.