నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్: కలెక్టర్

నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్: కలెక్టర్

W.G: జిల్లాలో దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం, పారదర్శకం చేసేందుకు డిజిటల్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. బుధవారం నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దివ్యాంగత్వ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మార్చి 30, 31 తేదీలతో పాటు ఏప్రిల్, మే నెలలకు కూడా ముందస్తు టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.