బీచ్‌లో వాషింగ్.. కొట్టుకుపోయిన కారు!
కొంతమంది యువకులు గోవాకు వెళ్లారు. ఈ క్రమంలో తమ కారును శుభ్రం చేసేందుకు ఏకంగా సముద్ర తీరానికి తీసుకెళ్లగా.. ఒక్కసారిగా వచ్చిన భారీ అలల ధాటికి కారు సముద్రంలోకి కొట్టుకుపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. నిబంధనలు ఉల్లంఘించి బీచ్‌లోకి వాహనాన్ని తెచ్చినందుకు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.