మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: కలెక్టర్
సూర్యాపేట: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రకటనలో నిబంధనలు పాటించాలన్నారు. నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు సిద్ధంగా ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సోమవారం సాయంత్రం స్పష్టం చేశారు.