ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

KMM: ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7,420 నగదు, ఐదు సెల్ ఫోన్లు, 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది పేకాట ఆడుతుండగా, మిగతా 9 మంది పరారయ్యారు. అరెస్టు అయిన ఆరుగురు మైలవరం, మురుసుమల్లి, బుచ్చిరెడ్డిపాలెం గ్రామాలకు చెందినవారని ఎస్సై రమేశ్ కుమార్ తెలిపారు.