'నిర్ణీత సమయంలో గా నామినేషన్ దాఖలు చేయాలి'
ADB: జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్‌ల దాఖలు గడువు నేటితో ముగుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం తెలియజేశారు. స్థానిక ప్రజలు తక్షణమే నామినేషన్‌లు దాఖలు చేసుకోవాలని కోరారు. నామినేషన్‌ల స్వీకరణకు ఇవాళే చివరి రోజు కావడంతో, ప్రతి గ్రామంలో మైక్ అనౌన్స్‌మెంట్లు నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.