యుద్ధ మేఘాలు.. 110 డాలర్లు దాటిన క్రూడాయిల్

యుద్ధ మేఘాలు.. 110 డాలర్లు దాటిన క్రూడాయిల్

పశ్చిమాసియా ప్రాంతంలో క్షిపణి దాడులతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌లే లక్ష్యంగా దాడులు జరగడంతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 3%పైగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 110 డాలర్లు దాటి రికార్డ్ సృష్టించింది. ఇరాన్ తాజా హెచ్చరికలతో ముడిచమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనలో మార్కెట్లు ఉన్నాయి.