అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు దగ్ధం

NLR: చేజర్ల(M) ఆదూరుపల్లి ఎస్టీ కాలనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. చెంచయ్యతో పాటు అతని ఇద్దరు కుమారుల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. చెంచయ్య తన మనవడి పెళ్లి కోసం దాచిన రూ.3లక్షల నగదు, మూడు సవర్ల బంగారం బూడిదైపోయింది. దీంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.