షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో వస్త్ర దుకాణం దగ్ధం

WGL: నర్సంపేట పట్టణంలోని మెయిన్ రోడ్‌లో జయశ్రీ సినిమా టాకీస్ పక్కన ఉన్న శివరామ క్లాత్ స్టోర్‌లో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. స్టోర్‌లో మంటలు వేగంగా వ్యాపించి పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. షాపులోని దుస్తులు, విలువైన వస్తువులు దగ్ధం కావడంతో 80 లక్షల మేర నష్టం సంభవించినట్లు షాపు యజమాని భూపతి రాజు తెలిపారు.