మాజీ ప్రధాని ఇందిరకు మోదీ నివాళులు
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు X వేదికగా పోస్ట్ చేశారు. అటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహల్ గాంధీ ఢిల్లీలోని శక్తి స్థల్ వద్ద పుష్పాంజలి ఘటించారు.