1666 మందికి నూతన రేషన్ కార్డులు అందజేత

NLG: చింతపల్లిలో ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం 1666 మందికి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను 18 నెలలలోనే అమలు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలను కూడా అమలు చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.