ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
ASR: అరకులోయ మండలం, కంఠబౌసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. విద్యార్ధులకు వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్, ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM టీ. మోహన్ రావు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.