మనిషికి ఆరోగ్యమే సర్వస్వం: DY. DMHO
ADB: ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DY DMHO డా.మనోహర్ హాజరై ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి సంబంధించిన అనేక విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మనిషికి ఆరోగ్యమే సర్వస్వమన్నారు. విద్యార్థులకు ఆరోగ్య రంగంలో ఉన్న అనేక అవకాశాలపై వివరించారు.