చెట్టు పై నుంచి పడి యువకుడు మృతి
MDK: అల్లాదుర్గం మండల కేంద్రంలో గురువారం విషాద ఘటన జరిగింది. కామారెడ్డి జిల్లాకి చెందిన రాజునాల హరికృష్ణ (28) స్థానిక తోటలో చింతకాయలు దులిపేందుకు వెళ్లాడు. ఈక్రమంలో చెట్టు పై కాలుజారి కిందపడి తలకు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి సత్తవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.