రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

SRCL: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఉప్పల్-ఘట్‌కేసర్ మధ్యలో చోటు చేసుకుంది. సిరిసిల్లకు చెందిన హాసిని అనే యువతి తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్లి తిరిగి వస్తుండగా, బైక్ పై నుంచి అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.