VIDEO: సమస్యలు అడిగి తెలుసుకున్న ఛైర్మన్
SKLM: ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ రాయపాటి శైలజ ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీని బుధవారం సందర్శించారు. మహిళా విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలపై వేధింపుల నివారణ చట్టం, పోక్సో చట్టం, రాగింగ్ నిరోధక నిబంధనలు తదితర అంశాలను వివరించారు. మహిళల భద్రతకు సంబంధించిన సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.