'పడకేసిన పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు’

KDP: వేంపల్లి పంచాయతీలో చిన్నపాటి వర్షానికే మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. ఈ దారుల వెంట వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అన్నారు. దీనివల్ల దుర్వాసన వస్తుందని వాపోతున్నారు. ఈ విషయమై అనేక సార్లు పారిశుద్ధ్య సిబ్బందికి విన్నవించినా ఫలితం శూన్యమన్నారు. ఇప్పటికైనా పంచాయితీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు.