VIDEO: కుటుంబ పోషణకై ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ

VIDEO: కుటుంబ పోషణకై ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ

NLG: మహిళలు పురుషుల కంటే ఎందులోనూ తక్కువ కాదని పెద్దవూర మండలం బాసోని బావి తండాకు చెందిన రమావత్ మంగ అన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత పిల్లలను పోషించుకోవడానికి ఆటో నడుపుతున్నానని ఆమె తెలిపారు. తాను సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ తర్వాత తన కుటుంబ పోషణకు అక్కరకు వచ్చిందని ఆమె తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా మహిళలు అధైర్యపడవద్దన్నారు.