విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు: SP

విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు: SP

MLG: బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ములుగు ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం ములుగు జిల్లాకు సుందరీమణులు రానున్న నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డు నుంచి పై స్థాయి అధికారి వరకు కంటెస్టెంట్లకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.